- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vishwak Sen: నాలుగు సినిమాలకు విశ్వక్‌సేన్ అందుకునే పారితోషికం ఎంతో తెలుసా?
దిశ, సినిమా: దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడి ప్రతి రంగానికి వర్తించిన ఇది సినిమా రంగానికి అతికినట్టు సరిపోతుంది. అందునా సినీ తారలు ఈ మాటలను అక్షరాల పాటిస్తారు. సక్సెస్‌లో వున్నప్పుడే నాలుగురాళ్లు వెనకేసుకుంటారు. ఇప్పుడు ఈ యువ కథానాయకుడు విశ్వక్‌సేన్ అదే పనిలో వున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఈ యువ హీరో. ఇటీవల తన పారితోషికాన్ని నాలుగు కోట్ల నుంచి ఏకంగా ఏడు కోట్లకు పెంచిన విశ్వక్. ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నాడు. క్రేజ్ వున్నప్పుడే.. అవకాశం వచ్చినప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచుకోవాలి అనే పాలసీని ఫాలో అవుతున్నాడు విశ్వక్. అందుకే తాజాగా ఆయన నాలుగు సినిమాలు అంగీకరించాడు. రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ నాలుగు సినిమాలు పూర్తిచేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ నాలుగు సినిమాల పారితోషికంగా అక్షరాల 28 కోట్ల రూపాయాలు అందుకోనున్నాడు.