Mukesh Ambani: ముకేష్ అంబానీ ఇంటి నెల కరెంటు బిల్లు ఎన్ని లక్షలొస్తుందో తెలుసా?

by Anjali |
Mukesh Ambani: ముకేష్ అంబానీ ఇంటి నెల కరెంటు బిల్లు ఎన్ని లక్షలొస్తుందో తెలుసా?
X

దిశ, సినిమా: ప్రపంచ కుబేరుడై ముకేష్ అంబానీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇటీవలే ఈయన చిన్న కుమారుడు అనంత్ అంబానీకి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి ప్రముఖ వ్యాపారవేత్తలు, టాలీవుడ్ అండ్ బాలీవుడ్ సెలబ్రిటీలు తరలివచ్చారు. అంతేకాకుండా కోట్లు విలువ చేసే బహుమతులు కూడా సమర్పించారు. అనంత్ అంబానీ కూడా తన సహచరులకు కోట్లు విలువ చేసే వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇకపోతే దేశ కుబేరుడు ముకేష్ అంబానీ ఇల్లు ఎంత పెద్దగుంటుందో తెలిసిందే. మొత్తం 27 ఫ్లోర్స్ కలిగున్న భవనంలో అంబానీ ఫ్యామిలీ నివసిస్తుంది.

వీరి ఇంట్లోనే మినీ థియేటర్ కూడా ఉంటుంది. స్మిమ్మింగ్ ఫూల్ అండ్ వంద కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్, తొమ్మిది లిఫ్ట్ లు ఉంటాయట. నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలంలో అంబానీ ఇంటిని కట్టారట. ఈ హౌస్ కంప్లీట్ చేయటానికి ఏకంగా 6 ఏళ్లు పట్టిందట. అయితే ఇంత పెద్ద భవనానికి కరెంట్ బిల్లు ఎంత వస్తుందని నెట్టింట జనాలు చర్చించుకుంటున్నారు. అంబానీ ఫ్యామిలీ ప్రతి నెలా దాదాపు 6, 37, 240 యూనిట్ల విద్యుత్ ఉపయోగిస్తారట. కాగా విద్యుత్ బిల్లు నెలకు 70 లక్షల రూపాయలకు పైగా వస్తుందట.



Next Story