Natural Star Nani Son: కీర్తి సురేష్‌ను హీరో నాని కొడుకు ఎలా పిలుస్తాడో తెలుసా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Kavitha |
Natural Star Nani Son: కీర్తి సురేష్‌ను హీరో నాని కొడుకు ఎలా పిలుస్తాడో తెలుసా..? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరు కలిసి జంటగా నేను లోకల్, దసరా వంటి సినిమాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అలా కలిసి నటించింది రెండు సినిమాలే అయినా.. ఇండస్ట్రీలోని బెస్ట్ ఫ్రెండ్స్‌లో వీరిద్దరు ఓకరు అని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అయితే వీరి స్నేహానికి సంబంధించి కీర్తి సురేష్.. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హైదరాబాద్‌కి వస్తే నాని ఇంటికే మిస్ అవ్వకుండా వెళ్తాను, వాళ్ళ వంటింట్లోకి కూడా వెళ్లి వంట కూడా చేసి పెడుతుంటాను.. నాని ఫ్యామిలీ నాకు అంత క్లోజ్. నాని భార్య అంజనా కూడా చాలా క్లోజ్ అని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా మరో విషయం వైరల్ అవుతుంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ ‘రఘు తాత’ అనే మూవీలో నటిస్తోంది. తమిళంలో రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. అక్కడి మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ అమ్మడు. ఆ ఇంటర్వ్యూలో నాని కొడుకు అర్జున్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. "నాని కొడుకు జున్ను నా స్ట్రెస్ బస్టర్. జున్ను నన్ను కీర్తి అత్త అని పిలుస్తాడు. వాడి క్యూట్ నెస్ చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడు. జున్ను పెద్దవాడవడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌కి వస్తే కచ్చితంగా జున్నుని కలిసే వెళ్తాను. వాడి వాయిస్ మెసేజెస్ వింటూ ఉంటాను. నాకు బర్త్ డే విషెష్ కూడా క్యూట్‌గా చెప్పాడు అని చెప్పి.. అర్జున్ హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని చెప్పిన వాయిస్ క్లిప్‌ని కూడా ఆ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ వినిపించింది. దీంతో నాని ఫ్యామిలీకి కీర్తి సురేష్‌తో ఎంత మంచి స్నేహం ఉందో తమిళ ఆడియన్స్‌కు కూడా అర్ధం అయ్యింది. అయితే అర్జున్ అత్త అని పిలిస్తే కీర్తి నానికి చెల్లెలు అవుతుంది కదా అంటూ కూడా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story