ఎవరి సపోర్టుతో వచ్చినా.. సత్తాచూపకపోతే ఔటే: నెపోటిజంపై దివ్యా

by Prasanna |   ( Updated:2023-05-18 06:55:42.0  )
ఎవరి సపోర్టుతో వచ్చినా.. సత్తాచూపకపోతే ఔటే: నెపోటిజంపై దివ్యా
X

దిశ, సినిమా: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో కొంతకాలంగా కొనసాగుతున్న నెపోటిజం ఇష్యూపై దివ్యా దత్తా తన అభిప్రాయం వెల్లడించింది. నిజానికి స్టార్ పిల్లలుగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా ఇక్కడ రాణించడం అంత సులభం కాదని చెప్పింది. ‘స్టార్ నటీనటుల పిల్లలు ప్రతి ఒక్కరూ బంధుప్రీతి సమస్యను ఎదుర్కొంటారు. అయితే వారు స్టార్ కిడ్స్ అయినప్పటికీ ఇక్కడ స్టార్‌డమ్ సంపాదించడం అంత ఈజీ కాదు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు అందరూ నన్ను ‘గుడ్ యాక్ట్రెస్’ అని పిలిచేవారు. ఇప్పుడు ‘స్టార్ యాక్ట్రెస్’ అంటున్నారు. అంతేకాదు ‘మీరు మాలాగే సాధారణంగా కనిపిస్తారు’ అని ప్రేక్షకులు చెప్పినప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుంది. నటన జీవితంలో అదే ముఖ్యమైనదిగా భావిస్తాను’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

ఇవి కూడా చదవండి: ఆయనతో పనిచేయాలనేది నా డ్రీమ్.. ఇన్నాళ్లకు నెరవేరింది

Advertisement

Next Story