Disha Patani : ప్రభాస్ ‘కల్కి’ నుంచి ‘రాక్సీ’ వచ్చేసింది.. దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

by Javid Pasha |
Disha Patani : ప్రభాస్ ‘కల్కి’ నుంచి ‘రాక్సీ’ వచ్చేసింది.. దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్
X

దిశ, సినిమా : ప్రభాస్ మూవీ అంటేనే సినీ లవర్స్‌లో అదో క్రేజ్. అతను నటిస్తున్న కల్కి సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా మస్తు ఆకట్టుకుంది. హాలీవుడ్ రేంజ్‌లో ఉందంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అయితే తెగ మురిపోతున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కాగా ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటాని నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి పలువురు నటీ నటుల క్యారెక్టర్లు రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా నేడు దిశా పటాని బర్త్ డే సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా విషెష్ చెప్తూ.. ఆమె క్యారెక్టర్ పేరు ‘రాక్సీ’ అని పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story