- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హీరోయిన్‌ను తిట్టిపోసిన డైరెక్టర్.. అలా చేస్తే నొప్పి కలుగుతుందా?

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ లేటెస్ట్ ఫిల్మ్ 'లాల్ సింగ్ చడ్డా' బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తూనే ఉంది. ఈ సినిమా ఇప్పటికే డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా.. బాయ్‌కాట్ చేయొద్దని కోరుతూ తాజాగా స్టేట్మెంట్ ఇచ్చింది కరీనా. ఈ చిత్రానికి 250 మంది పనిచేశారని, దయచేసి ఈ సినిమాను అడ్డుకోకూడదని కోరింది.
కాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన 'ది కశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. 'మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వకుండా బాలీవుడ్ మాఫియా అడ్డుకున్నప్పుడు ఎవరు మాట్లాడలేదేంటి? అప్పుడు ఆ చిత్రాలకు పనిచేసిన 250 మంది పేదల బతుకుల గురించి ఎవరు ఆలోచించారు? బాలీవుడ్ కింగ్స్ బయట నుంచి వచ్చిన దర్శకులు, నటులు, రచయితల కెరీర్‌ను నాశనం చేస్తుంటే ఎందుకు ప్రశ్నించలేదు? సామాన్య భారతీయులు బాలీవుడ్ డాన్ల అహంకారం, ఫాసిజం, హిందూఫోబియా గురించి తెలుసుకున్న రోజున వేడి కాఫీలో ముంచేస్తారు. జాగ్రత్త' అని హెచ్చరించాడు.