పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ భార్య వైరల్ కామెంట్..

by sudharani |   ( Updated:2023-04-02 13:55:01.0  )
పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ భార్య వైరల్ కామెంట్..
X

దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీ అంటే అందులో ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అయితే ఎప్పుడు సినిమాల విషయంలో తప్ప, త్రివిక్రమ్ ఫ్యామిలీ గురించి అంతగా విషయాలు బయటకు రావు. ఇక ఆయన సతీమణి సౌజన్య శ్రీనివాస్ గురించి మాట్లాడుకుంటే.. ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ అని మాత్రం తెలుసు. అయితే తాజాగా త్రివిక్రమ్ భార్య సౌజన్య పవన్ కళ్యాణ్ గురించి కొన్ని కామెంట్స్ చేసింది.

‘పవన్ కళ్యాణ్‌తో మా కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. తరచుగా ఇంటికి వస్తుంటారు. త్రివిక్రమ్, పవన్ ఇద్దరు పురాణాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. త్రివిక్రమ్ పవన్‌కు రకరకాల పుస్తకాలు ఇస్తుంటారు. మా బ్రాహ్మణ భోజనం అంటే పవన్‌కు చాలా ఇష్టం. ఇంటికి వచ్చినప్పుడు నేను వండిన వంటతో తప్పకుండా భోజనం చేసే వెళ్తారు. అలాగే నేను ఎప్పుడైనా క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినా మా సోదరి అద్భుతంగా చేసిందని ప్రశంసిస్తారు’ అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed