ఇదొక డిఫరెంట్ కథ.. ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ చేస్తుంది

by sudharani |
ఇదొక డిఫరెంట్ కథ.. ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ చేస్తుంది
X

దిశ, సినిమా: యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కలి’. శివ శేషు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో ‘రుద్ర క్రియేషన్స్’ సంస్థ నిర్మిస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ శివ శేషు.. చిత్ర విశేషాలను పంచుకున్నారు.

‘జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. కలి చిత్రంలో ప్రిన్స్ చేసిన శివరామ్ క్యారెక్టర్ చాలా మంచి వ్యక్తి. అతని మంచితనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మెత్తగా ఉండేవాడిని సొసైటీ ఆడుకుంటుంది. అలా అతి మంచితనంతో ఉన్న శివరామ్ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వస్తాడు. ఈ క్యారెక్టర్ నరేష్ అగస్త్య చేశాడు. అతను వచ్చాక శివరామ్ లైఫ్‌లో జరిగిన ఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం. ఇదొక డిఫరెంట్ కథ. ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ చేస్తుంది’ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed