త్వరలోనే ప్రకటిస్తాం.. ‘జై హనుమాన్’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

by sudharani |   ( Updated:2024-09-11 14:30:27.0  )
త్వరలోనే ప్రకటిస్తాం.. ‘జై హనుమాన్’పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్
X

దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే.. ఇలాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ సీక్వెల్ కూడా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌కు సంబంధించి ‘జై హనుమాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసి.. చిన్న వీడియో క్లిప్ కూడా రిలీజ్ చేశారు. దీంతో పార్ట్ 2పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు. ఈ క్రమంలోనే ‘జై హనుమాన్’పై ఓ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

‘‘హనుమాన్’ సినిమా రూ. 100 కోట్లు మాత్రమే సాధించి ఉంటే ఇప్పటికే ‘జై హనుమాన్’ షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసేవాళ్లం. కానీ హనుమాన్ అంచనాలను మించి వసూళ్లు చేయడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకోవడంతో.. ‘జై హనుమాన్’పై మరింత బాధత్య పెరిగింది. అందుకే కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వర్క్ చేస్తున్నాం. అంతే కాదు.. ‘జై హనుమాన్’లో బాలీవుడ్‌కు చెందిన పలువురిని మీరు చూస్తారు. అలాగే నటీనటుల ఎంపిక మొదలుకుని ప్రతి పని జరుగుతోంది. ఇప్పటికే నటీనటుల ఎంపిక విషయంలో నిర్ణయం జరిగిపోయింది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. డైరెక్టర్ కామెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్ కావడంతో.. ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story