- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా జర్నలిస్టుకు ఘోర అవమానం.. ముఖానికి కుక్క మలమూత్రాలు పూసిన డైరెక్టర్!
దిశ, సినిమా: ప్రముఖ జర్మనీ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ 'మార్కో గోకేని' అసభ్యకరమైన ప్రవర్తన వల్ల విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు ఆ దేశంలోని 'హానోవర్ స్టేట్ ఒపెరా బ్యాలెట్' తనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. విషయానికొస్తే.. ఇటీవల ఓ మహిళా జర్నలిస్ట్ తన సినిమాకు బ్యాడ్ రివ్యూ ఇచ్చిందనే కోపంతో ఆమె ముఖంపై కుక్క మలాన్ని పూసినట్లు జర్మన్ వార్తాపత్రిక FAZ వెల్లడించింది. ''గ్లాబ్-లీబే-హాఫ్‌నంగ్' ప్రీమియర్ షో విరామ సమయంలో నా దగ్గరకు వచ్చిన మార్కో.. ఓ బ్యాగ్ నుంచి కుక్క మలమూత్రాలను తీసి నా ముఖంపై అద్దాడు. దీంతో నేను కలత చెందాను. శరీరానికి హాని కలిగించే నేరంతో పాటు, కళపై మన స్వేచ్ఛా, విమర్శనాత్మక దృక్పథాన్ని భయపెట్టే ప్రయత్నాన్ని అడ్డుకోవడం అవమానకరమైన చర్యగా పరిగణించాలి' అని మహిళా జర్నలిస్ట్ వాపోయింది.
దీనిపై వెంటనే స్పందించిన ఒపెరా బ్యాలెట్.. 'దీనికి మేము చింతిస్తున్నాం. సంఘటన జరిగిన వెంటనే మేము జర్నలిస్టును సంప్రదించి ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాము. మార్కో ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించడంతో పాటు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేసినందుకు అతనిపై నిషేధం విధిస్తున్నాం' అని స్పష్టం చేసింది.