‘అఖండ 2’పై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఈసారి అదే చూపిస్తానంటూ కామెంట్స్

by sudharani |   ( Updated:2024-04-16 13:45:22.0  )
‘అఖండ 2’పై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్.. ఈసారి అదే చూపిస్తానంటూ కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి నటసింహం, లెజెండ్ బాలకృష్ణ హీరోగా 2021లో వచ్చిన చిత్రం ‘అఖండ’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్వకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా విజయాన్ని సాధించింది. ఈ మూవీ తర్వాత.. బోయిపాటి రామ్ పోతినేనితో ‘స్కంద’ సినిమా చేశారు. ఇది బాక్సాఫీస్ వద్దా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తర్వాత ఇంకో సినిమా ప్రకటించలేదు దర్శకుడు. అయితే.. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ‘అఖండ 2’ గురించి అప్‌డేట్ ఇచ్చాడు.

ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్నికల అనంతరం నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రివీల్ చేస్తాను. అలాగే ‘అఖండ 2’ లో ఈ సమాజానికి ఏం అవసరమో అదే చూపిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఎలక్షన్ల తర్వాత ‘అఖండ 2’ ఉంటుందా అంటూ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story