Dimple Hayathi : తెలంగాణ సర్కార్‌‌పై మరోసారి ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Hamsa |   ( Updated:2023-08-17 05:41:41.0  )
Dimple Hayathi : తెలంగాణ సర్కార్‌‌పై మరోసారి  ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హయాతి ‘ఖిలాడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల తెలంగాణ ట్రాఫిక్ గురించి పలు పోస్టులు చేసి పెద్ద దుమారం రేపాయి. అంతేకాకుండా డిసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టి ధ్వంసం చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనపై క్రిమినల్ కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఈ అమ్మడు నిత్యం సర్కార్‌పై పలు వివాదాస్పద పోస్టులతో రచ్చ చేస్తోంది. తాజాగా, మరోసారి డింపుల్ హయాతి ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. తన ఇన్‌స్టాస్టోరీలో కుక్కలను బంధించి తీసుకెళ్తున్న వీడియో షేర్ చేస్తూ తెలంగాణలో ఇలాగే జరుగుతుంది. ఎవరైనా ఆపండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం డింపుల్ మయాతి పోస్ట్ వైరల్‌గా మారింది.



Advertisement

Next Story