Dimple Hayathi: కిల్లింగ్ లుక్స్‌లో డింపుల్ హయాతి.. గుండెల్లో 1000 వాట్స్ కరెంట్ సప్లై అవుతుందంటున్న నెటిజన్స్

by Kavitha |
Dimple Hayathi: కిల్లింగ్ లుక్స్‌లో డింపుల్ హయాతి.. గుండెల్లో 1000 వాట్స్ కరెంట్ సప్లై అవుతుందంటున్న నెటిజన్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ బ్యూటీ విజయవాడకు చెందిన అచ్చ తెలుగు అమ్మాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘గల్ఫ్’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. తర్వాత ‘అభినేత్రి 2’ అనే సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ఇక వరుణ్ తేజ్ హీరోగా చేసిన ‘గద్దల కొండ గణేష్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసి సంచలనమే సృష్టించింది. ఆ తర్వాత రవితేజ హీరోగా చేసిన ‘కిలాడి’ సినిమాలో నటించిన ఈ భామ గోపీచంద్ సరసన ‘రామబాణం’ మూవీలో కూడా మెరిసింది. ఇలా వరుస ఆఫర్లు వస్తున్నాయి.. కానీ, అనుకున్నంత స్టార్‌డమ్ అయితే రావడం లేదు. దీంతో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈమె ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా డింపుల్ హయాతి సోషల్ మీడియా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో గ్రే కలర్ టాప్ బ్లాక్ కలర్ బాటమ్ వేసుకుని కిల్లింగ్ లుక్స్‌తో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు ఆ కళ్ళు చూస్తుంటే.. అబ్బో గుండెల్లో 1000 వాట్స్ కరెంట్ సప్లై అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

(video link credits to dimple hayati instagram id)

Advertisement

Next Story