డిమోంటే కాలనీ 2 తెలుగు వెర్షన్‌కు భారీ వసూళ్లు.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Prasanna |
డిమోంటే కాలనీ 2 తెలుగు వెర్షన్‌కు భారీ వసూళ్లు.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా తెరకెక్కిన మూవీ విడుదలై డీమోంటి కాలనీ సూపర్ హిట్ గా నిలిచింది. థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అరుళ్ నిధి, రమేష్ తిలక్, సనంత్ నటించారు. కేవలం రూ. 2 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా మొత్తం రూ.17 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

తమిళ దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు మూవీ వస్తుందంటే చాలు తెలుగు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ‘ డిమోంటి కాలనీ’ , ‘అంజలి సీబీఐ’ వంటి సినిమాలు మన తెలుగు వారి మెప్పు పొందాయి. వాస్తవానికి ‘డిమోంటి కాలనీ’ సినిమాని టీవిలో చాలా మంది చూశారు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా డీమోంటి కాలనీ 2 మన ముందుకు వచ్చింది. తెలుగులో ఈ మూవీని ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ రిలీజ్ చేసింది.

డీమోంటి కాలనీ 2 మూవీ తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మొదటి రెండు రోజుల్లో రూ. 1.65 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. మూడో రోజు ఆదివారం కావడంతో రూ. 75 లక్షల గ్రాస్ వసూలు చేసి హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో, ఈ మూవీ రూ. 02.40 కోట్ల రూపాయలను నమోదు చేసింది. ఈ మూవీ టాక్ పాజిటివ్ గా ఉండటం వలన కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement

Next Story