Dil Raju: మైక్ పట్టుకుని యాంకర్ అవతారమెత్తిన నిర్మాత దిల్ రాజు.. థియేటర్‌ బయట హల్‌చల్

by Shiva |
Dil Raju: మైక్ పట్టుకుని యాంకర్ అవతారమెత్తిన నిర్మాత దిల్ రాజు.. థియేటర్‌ బయట హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన, హీరో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ సోషల్ మీడియాలో నెగటివ్ టాక్‌తో మారుమోగుతోంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్, పరశురామ్ దర్శకుడిగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాత ఈ చిత్రాన్ని రూపొందించగా ఈ నెల 5న సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ స్టార్ మూవీ బాగున్నప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. దీంతో ఏకంగా నిర్మాత దిల్ రాజే రంగంలోకి దిగారు. కావాలనే నెగెటివీటీ ప్రచారం చేస్తుండటంతో రియాక్ట్ అయ్యారు.

దీంతో ఆయన గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో మైక్ పట్టుకుని యాంకర్ అవతారమెత్తారు. నేరుగా ప్రేక్షకుల నుంచే ఒపీనియన్ తీసుకోగా.. సినిమా బాగుందంటూ ప్రేక్షకులు కీతాబిచ్చారు. అదేవిధంగా నెగెటివ్ పోస్టులపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు వారు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నట్లుగా తెలుస్తోంది. బీ, సీ సెంటర్లల్లో మంచి టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ అంచనాలకు మించి కలెక్షన్లను రాబట్టుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజే రూ.6.5 కోట్ల మేర వసూళ్లను సాధించింది.

Advertisement

Next Story