Dil Raju: స్విమ్ సూట్‌లో దిల్ రాజు కుమార్తె.. నెట్టింట హల్ చల్ చేస్తోన్న ఫొటోలు

by Anjali |
Dil Raju: స్విమ్ సూట్‌లో దిల్ రాజు కుమార్తె.. నెట్టింట హల్ చల్ చేస్తోన్న ఫొటోలు
X

దిశ, సినిమా: చిన్నా, పెద్ద సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను నిర్మిస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫూల్ నిర్మాతల జాబితాలో స్థానం దక్కించుకున్న వారిలో ఈయన ఒకరు. ‘‘రౌడీ బాయ్స్‌, ఇద్దరి లోకం ఒకటే (2019) శ్రీనివాస కల్యాణం, లవర్, ఎంసిఏ, ఫిదా, దువ్వడ జగన్నాధం, నేను లోకల్, శతమానం భవతి, కృష్ణాష్టమి, సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కేరింత, పిల్లా నువ్వు లేని జీవితం, ఎవడు, రామయ్యా వస్తావయ్యా, రామ రామ కృష్ణ కృష్ణ, మిస్టర్.పర్ఫెక్ట్ ఓ మై ఫ్రెండ్’’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇకపోతే దిల్ రాజు డాటర్ హన్షితా రెడ్డి గురించి తెలిసిందే. ప్రస్తుతం ఈమె విదేశాల్లో చక్కర్లు కొడుతోంది.

భర్త అర్చిత్ రెడ్డి, తన పిల్లలతో కలిసి వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తోంది. సముద్రంలో బోటు‌లో షికారు చేసినవి, కారు రేసింగ్‌లో పాల్గొన్న, పులికి పాలు తాగిస్తోన్న ఫొటోలను హన్హితా రెడ్డి సోషల్ మీడియాలో పంచుకుంది. స్విమ్ సూట్ ధరించి భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలను హన్షితా నెట్టింట షేర్ చేయగా.. నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. దిల్ రాజు కుమార్తెను స్విమ్ చూసి ఒక్కసారిగా షాక్ తింటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై మూవీస్ నిర్మిస్తున్నారు. కుమార్తె హన్షితా రెడ్డి.. దిల్ రాజు పేరు మీద ప్రొడక్షన్స్ స్థాపించి.. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నారు. బలగం చిత్రం నిర్మాతల్లో హన్షితా రెడ్డి కూడా ఒకరు.

Advertisement

Next Story

Most Viewed