Hero Ram: డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఇంతలా కష్టపడ్డాడా..?

by Prasanna |   ( Updated:2024-08-13 08:29:02.0  )
Hero Ram: డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఇంతలా కష్టపడ్డాడా..?
X

దిశ, సినిమా : తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో రామ్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ప్రతీ మూవీకి చాలా కష్ట పడుతుంటాడు. తన ఎనర్జీని అంతా మూవీలో చూపిస్తాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్ హీరో డబల్ ఇస్మార్ట్ మూవీతో మన ముందు రాబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా పూరి జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కింది.

తాజాగా రామ్ సోషల్ మీడియాలో సిక్స్ ప్యాక్ ఫోటోలు షేర్ చేసాడు. దీని కోసం ఫుల్ గా డైట్ చేసి, జిమ్ లో శ్రమించి డబల్ ఇస్మార్ట్ కి సరిపోయే సిక్స్ ప్యాక్ లుక్ తీసుకొచ్చాడు. ఈ మేకోవర్ కోసం రామ్ కొన్ని నెలలు కష్టపడ్డానని తెలిపాడు.

రామ్ డబుల్ ఇస్మార్ట్ కోసం మార్చుకోవడం ప్రారంభించినప్పటి నుండి అతను కోరుకున్న లుక్ వచ్చేదాకా చాలా ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. డబుల్ స్మార్ట్ కోసం తాను మంచి ఆహారం తిన్నానని, నార్మల్ గానే వర్క్ అవుట్ చేశానని చెప్పారు. ఈ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ సిక్స్ ప్యాక్ లో ఎంత బావున్నాడో అంటూ లేడీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా, రామ్ డబుల్ స్మార్ట్ కోసం ఫిజికల్ గా చాలానే కష్టపడ్డాడు. మరి ఇస్మార్ట్ శంకర్ అంత డబుల్ ఇస్మార్ట్ హిట్ అవుతుందో? లేదో చూడాల్సి ఉంది.

Read More..

Ram Pothineni: పక్కోడి.. పకోడీలు పట్టించుకుంటే పనులు జరగవు: రామ్ పోతినేని

Advertisement

Next Story