- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగబాబు అప్పులు తీర్చడానికి పవన్ కళ్యాణ్ ఆ పని చేశారా?
దిశ, సినిమా : మెగా బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు ఇప్పటికీ చాలా సరదగా, ఫ్రెండ్లీగా కలిసి మెలిసి ఉంటారు. ఒకరి కష్టాల్లోఒకరు, ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంచుకుంటూ, ఆనందంగా ఉంటారు. అయితే ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం చాలా కష్టపడింది. ప్రచారంలో పాల్గొని, ఓటర్లను వేడుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఫ్యామిలీ మొత్తం పెద్ద పార్టీ చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల పరంగా నాగబాబు ఎంతో సపోర్ట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే గతంలో పవన్ కళ్యాణ్, నాగబాబుపై పరోక్షంగా చేసిన కొన్ని కామెంట్స్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పటికీ ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం. అయితే గతంలో యాంకర్ శిల్పా చక్రవర్తి చేసిన ఓ ఇంటర్వ్యూ పవన్ కళ్యాణ్ నాకు గబ్బర్ సింగ్ సినిమా చేయడం అంతా ఇష్టం లేదు మా బ్రదర్‌కు ఏదో సినిమాలకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ఆ సినిమాకు ఒప్పుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా నాకు చూపెట్టీ, ఇది మనం చెద్దాం అన్నారు. కానీ నేను నో చెప్పాను. తర్వాత మా బ్రదర్‌కు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం వలన అప్పులు తీర్చడానికి సరైన దారి ఆలోచిస్తే అప్పుడు దబాంగ్ గుర్తుకు వచ్చింది. దీంతో ఆ సినిమా మళ్లీ చూసి, కొన్నిమార్పులు చేర్పులను గమనించి డైరెక్టర్‌కు చెప్పి తర్వాత సినిమాకు ఒకే చెప్పాను అని చెప్పారు. దీంతో ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్ సెన్షేషనల్ అయ్యాయి. నాగబాబు సినిమాలు నిర్మించి చాలా అప్పుల పాలు అయ్యాడు ఆ బాకీలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తీశాడా అంటూ పలువురు ముచ్చటించుకున్నారు. అయితే ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తాజాగా, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.