- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ టాబ్లెట్స్ కారణంగానే అధిక బరువు పెరిగిన నివేదా థామస్..?
దిశ, వెబ్‌డెస్క్: నివేదా థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘జెంటిల్ మేన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. నిన్ను కోరి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2002 లో మలయాళ చిత్రం ‘ఉత్తర’తో బాలనటిగా అరంగేట్రం చేసిన నివేదా.. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘జై లవ కుశ’ సినిమాలో కాస్త లావుగా కనిపించిన నివేదా.. తెలుగులో చివరగా రెజీనా కసాండ్రాతో ‘షాకిని డానికి’ సినిమా చేసింది. అప్పటి నుంచి అధిక బరువు కారణంగా ఇబ్బంది పడుతున్న నివేదాకు సినిమా ఆఫర్లు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే.. నివేదా అంతలా లావు అయిపోవడానికి ఆ టాబ్లెట్సే కారణమంటూ ప్రస్తుతం ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విషయమేంటంటే..
నివేదా ఫుడ్ లవర్. తనకు ఏది ఇష్టమైతే ఆ ఫుడ్ తినేదట. ఇక ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో ఇష్టమైన ఫుడ్ తింటూ బరువు కూడా బాగా పెరిగిపోయింది ఈ అమ్మడు. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో నివేదా.. థైరాయిడ్ ప్రాబ్లెంతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె థైరాయిడ్ తగ్గడం కోసం టాబ్లెట్ వేసుకుంటుందట. దీంతో ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ కారణంగా ఆమె బాగా బరువు పెరుగుతున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఆమె సినిమాలకు దూరమైనట్లు తెలుస్తోంది.