చైతన్యతో విడాకులు.. ఆ వీడియోతో నిహారిక క్లారిటీ ఇచ్చినట్లేనా?

by samatah |   ( Updated:2023-05-19 07:38:35.0  )
చైతన్యతో విడాకులు.. ఆ వీడియోతో నిహారిక క్లారిటీ ఇచ్చినట్లేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా డాటర్, నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక విడాకులు తీసుకోబోతుదంటూ ఈ మధ్య చాలా వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. చైతన్యకు, నిహారికకు మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే వారు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి.

ఇక చైతన్య తన ఇన్ స్టా గ్రామ్ నుంచి తమ పెళ్లికి సంబంధించిన ప్రతి ఫొటోను డిలీట్ చేయడం, నిహారిక ఫొటోలు కూడా డిలీట్ చేయడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. దీంతో వీరు నిజంగానే విడాకులు సిద్ధమయ్యారంటూ తమ అభిమానులు ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్న ఓ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రోమోను నిహారిన త‌న ఇన్‌గ్రామ్ లో పోస్ట్ చేశారు. `డెడ్ పిక్సెల్స్` అనే టైటిల్ తో తెరకెక్కుతున్నఈ ప్రాజెక్ట్ ను నిహారిక నిర్మించ‌డ‌మే కాకుండా, అందులో నటించింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. అయితే చైతన్యకు నిహారిక నటిచండం ఇష్టం లేదు. ఈ విషయాన్ని నిహారికే ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. చైతూ కోసమే నిర్మాతగా మారాను అంటూ.. ఇప్పుడు డెడ్ పిక్సెల్స్ లో ఆమె నటించడం కారణంగానే వీరిద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. అందుకే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ, నిహారిక తన పోస్టులోని వీడియోతో క్లారిటీ ఇచ్చిదంటూ మరో వార్త వైరల్ అవుతుంది. ఇక దీనిపై చైతన్య లేదా నిహారిక స్పందించే వరకు క్లారిటీ వచ్చేలా లేదు.

Also Read: ఫ్లాప్ దర్శకుడికి రవితేజ మరోసారి అవకాశం?

Advertisement

Next Story