సినిమాల్లోకి రాకముందు నయనతార ఆ పని చేసేదా..! షాకింగ్ వీడియో వైరల్

by Hamsa |   ( Updated:2023-10-02 09:03:42.0  )
సినిమాల్లోకి రాకముందు నయనతార ఆ పని చేసేదా..! షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార లేడీ సూపర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, అద్భుతమైన నటనతో అనతి కాలంలోనే స్టార్‌గా ముద్ర వేసుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ సౌత్ ఇండియన్ ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్‌టైన్ చేస్తున్న నయన్‌కి సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. నయన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది ఆ వీడియోలో కనిపించింది. బుల్లితెర యాంకర్‌గా దర్శనమిచ్చిన నయనతార మలయాళ టీవీ ఛానెల్ లో యాంకర్‌గా ఓ ప్రోగ్రాం చేసేదట.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోనే నెట్టింట వైరల్ గా మారింది. అందులో నయన్ రూపం, ఆమె మాట్లాడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇకపోతే నయన్ అసలు పేరు డయానా అని సమాచారం. తొలి సినిమా ‘మనసీనక్కరే’ మూవీ తర్వాత డైరెక్టర్ ఆమె పేరును నయనతారగా మార్చాడని తెలుస్తోంది. అప్పటి నుంచి ఆమె కెరీర్ పీక్స్‌లోకి వెళ్లి స్టార్ హీరోయిన్‌గా ఇప్పటికీ దూసుకుపోతుంది. ఇకపోతే నయనతార ఇటీవల ‘జవాన్’ మూవీతో అభిమానులను అలరించింది.

Advertisement

Next Story

Most Viewed