Nora Fatehi : నిర్మాత చేంజ్ అయితే.. హీరోయిన్ కూడా మారిపోవాల్సిందేనా?

by Prasanna |   ( Updated:2023-08-23 16:11:29.0  )
Nora Fatehi : నిర్మాత చేంజ్ అయితే.. హీరోయిన్ కూడా మారిపోవాల్సిందేనా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ తన మనసుకు దగ్గరైన సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చాడు. ఇండియాస్ ఫస్ట్ ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ ఫిల్మ్‌గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌‌కు ‘క్రాక్’ టైటిల్ కన్ఫర్మ్ చేయగా.. హీరోయిన్‌గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ పేరును ప్రకటించారు. అయితే లీడింగ్ ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతున్న విద్యుత్.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ బ్యానర్‌‌కు చెందిన నిర్మాత.. జాక్వెలిన్‌కు బదులుగా నోరా ఫతేహిని తీసుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. నోరా ఇంతకు ముందు ఆ బ్యానర్‌లో వర్క్ చేయగా.. తనతో కంఫర్ట్‌గా ఉన్నామని, అందుకే హీరోయిన్‌ను రీప్లేస్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు టాక్. కాగా ఈ ఇద్దరు హీరోయిన్లకు కూడా కాన్మన్ సుఖేశ్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : బాలీవుడ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న ‘Gadar 2’

Advertisement

Next Story

Most Viewed