- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తల్లి ఇల్లు వదిలి వెళ్లడం సాహసంతో కూడిన చర్యే : దియా మీర్జా
దిశ, సినిమా: ప్రముఖ మోడల్, నటి దియా మీర్జా ప్రస్తుతం 41వ పడిలోకి అడుగు పెట్టింది. కాగా, పుట్టిన రోజు సందర్భంగా ఓ చానల్‌కి ఇచ్చిన సుధీర్ఘ ఇంటర్వ్యూలో పర్సనల్ లైఫ్, కెరీర్, తన పిల్లల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ మేరకు కాలం ఎంతో వేగంగా గడిచిపోతుందని, తన పిల్లలు కూడా ఊహించని విధంగా ఎదిగిపోయారని చెప్పింది. అలాగే పనిలో భాగంగా ఒక తల్లిగా ఇల్లు వదిలి వెళ్లడమనేది సాహసం తో కూడుకున్న చర్యగా భావిస్తానన్న ఆమె.. ఒక మహిళ ఇంటిని వదిలి వెళ్లడం కూడా అన్ని పరిస్థితుల్లో మంచిది కాకపోవచ్చని పేర్కొంది.
ఇక ఏ విషయంలోనైనా పురుషుల కంటే స్త్రీలకే అపరాధ భావం అధికంగా ఉంటుందని, ఎందుకంటే కుటుంబాన్ని కాపాడటంలో తల్లులే ప్రాథమిక సంరక్షకులమని తెలిపింది. ఇక కెరీర్ మొదట్లో ఉన్న భయాలు, సంకోచాలు కాలక్రమంలో పూర్తిగా తొలగిపోయాయన్న బ్యూటీ.. నిజ జీవితంలో నిజాయితీగా బతకడమే మనోహరమైనదని వెల్లడించింది. చివరగా 'భూమిపై ఉన్న సమస్త జీవరాశి జ్ఞానంతోనే పుడుతుందని నమ్ముతాను. పువ్వుకు ఎలా వికసించాలో ఎవరూ నేర్పలేదు. మానవులు కూడా అదే జ్ఞానంతో జన్మిస్తారని అనుకుంటున్నా' అంటూ ముగించింది.
ఇవి కూడా చదవండి:
మల్టీ కలర్ బికినీలో మత్తెక్కించిన Janhvi Kapoor. అబ్స్‌పైనే కన్నేసిన కుర్రాళ్లు