Hero Dhanush: రీ రిలీజ్ కి రెడీ అవుతున్న ధనుష్ మ్యూజికల్ హిట్ సినిమా..?

by Prasanna |   ( Updated:2024-08-16 14:25:07.0  )
Hero Dhanush: రీ రిలీజ్ కి రెడీ అవుతున్న ధనుష్ మ్యూజికల్ హిట్ సినిమా..?
X

దిశ, సినిమా : తమిళంలో హీరో ధనుష్, స్టార్ హీరో దళపతి విజయ్, అజిత్ లతో పోటీపడుతూ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్లో తనని హీరోగా నిలబెట్టిన సినిమా ‘3’. ఈ మూవీ తోనే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఇప్పటికి ఈ మూవీ టీవీల్లోకి వచ్చిన అదే పనిగా చూస్తుంటారు. ఎందుకంటే ఆ సినిమాకి క్రేజ్ అలాంటిది. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్, పాటలు, అనిరుద్ సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులోనూ కూడా ఈ మూవీకి అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాని రీ రిలీజ్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.

తమిళ ప్రేక్షకులు రీ రిలీజ్ ను బాగా ఎంజాయ్ చేసారు.. ఇప్పుడు అదే ఊపు తో తెలుగు వారిని కూడా అలరించేందుకు సిద్ధమవుతుంది. తెలిసిన సమాచారం ప్రకారం సెప్టెంబర్ 14న ‘3’ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed