- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Devara Movie: దేవర థర్డ్ సింగిల్ అప్డేట్.. ఎప్పుడంటే?
దిశ, సినిమా : నందమూరి కుటుంబం నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే చాలు అభిమానులు చేసే హడావుడి అంత ఇంత కాదు ఒక రేంజ్లో ఉంటుంది. గతేడాది విశ్వక్ సేన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా హాజరైన జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పెట్టారు. కొత్త సినిమా అప్డేట్స్ చెప్పాలంటూ గోల గోల చేసారు.. ఆ రోజు స్టేజ్ మీద ఏ చిన్నదైనా మీతోనే షేర్ చేసుకుంటాను అంటూఅందరి ముందు ఎన్టీఆర్ చెప్పాడు.
తాజాగా ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్, హీరోయిన్ లుక్, మొదటి పాట, రెండో పాట రిలీజ్ అయ్యాయి. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది 24 గంటల్లోనే వైరల్ అవుతుంది. ఇంకో 40 రోజులు ఆగితే .. థియేటర్లలో మోత మోగిపోద్ది అని మేకర్స్ అంటున్నారు. వాళ్లు అనౌన్స్ చేస్తున్న అప్డేట్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు
మొదటి పాట యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకెళ్తుంది. రెండో పాటలో జాన్వీ తో తారక్ చేసిన రొమాన్స్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మూడో పాట రిలీజ్ కి ప్రిపేర్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి నుంచి ప్రతి వారం ఏదోక అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో ఊపు తెప్పించాలని ఫిక్స్ అయిపోయారు.