Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. అక్కడ ఒక రోజు ముందుగానే దేవర రిలీజ్

by Anjali |
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. అక్కడ ఒక రోజు ముందుగానే దేవర రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 27 వ తేదీన గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దేవర గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్‌లో జరగనున్న ఓ ఈవెంట్లో దేవర చిత్రాన్ని ప్రదర్శించనున్నారట. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలిస్‌లో జరిగే అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో ఈ సినిమాను సెప్టెంబరు 26 వ తారీకున ఈజిప్షియన్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. కాగా ప్రీమియర్ తేదీని సాయంత్రం 6. 30 నిమిషాలకు ప్రకటించారు. ఈజిప్షియన్ థియేటర్ లో దేవర చిత్రాన్ని హాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు కూడా చూడనున్నారట.

ఈ విషయం కాస్త జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెవిన పడటంతో తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రీమియర్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ కూడా పాల్గొననుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీకి మొదటి సినిమా కావడంతో జాన్వీ అభిమానులంతా సెప్టెంబరు 27 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దేవర బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story