Sobhita Dhulipala : బార్ డ్యాన్సర్‌గా మారిపోయిన శోభిత ధూళిపాళ

by sudharani |   ( Updated:2024-01-29 05:24:03.0  )
Sobhita Dhulipala : బార్ డ్యాన్సర్‌గా మారిపోయిన శోభిత ధూళిపాళ
X

దిశ, సినిమా: దేవ్ పటేల్, శోభిత ధూళిపాళ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘మంకీ మ్యాన్’. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ‘నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చేప్పేది’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పెద్ద సిటీలో పేద ప్రజలను ఎవరూ పట్టించుకోరని.. అలాంటి వారికి గుర్తింపు తేవడం కోసం దేవ్ పటేల్ ముందుకు వస్తాడు. ఈ క్రమంలోనే అతడు ఎదుర్కొనే పరిస్థితులు, చివరకు దేవ్ అనుకున్నది ఎలా సాధిస్తాడు అనేది ఈ చిత్రం కథ. ‘మంకీ మ్యాన్’లో దేవ్ పటేల్ వెయిటర్ పాత్రలో కనిపించగా.. శోభితా బార్ డ్యాన్సర్‌గా అలరించనుంది. కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed