Deepika Padukone : ఐకాన్ స్టార్‌తో పనిచేయనున్న దీపికా పదుకొణె?

by Nagaya |   ( Updated:2023-10-30 14:15:23.0  )
Deepika Padukone  : ఐకాన్ స్టార్‌తో పనిచేయనున్న దీపికా పదుకొణె?
X

దిశ, సినిమా: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప2’ మూవీ కంప్లీట్ అవగానే 2024 ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని టాక్. అయితే ఈ సినిమాలో బన్నీకి జోడీగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాలో హీరోయిన్‌లను చాలా ప్రత్యేకంగా చూపిస్తాడు. మరి ఇదే నిజమైతే దీపికను ఎలా చూపిస్తాడో చూడాలి.

Advertisement

Next Story