- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హులా హూప్ ఛాలెంజ్‌లో అదరగొట్టేసిన దీపిక.. వీడియో వైరల్
దిశ, సినిమా: బీ టౌన్ స్టార్ యాక్ట్రెస్ దీపికా పదుకొణె ఓ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ వీడియోతో అభిమానులను అలరించింది. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన నటి జిమ్‌లో వ్యాయమాలతోపాటు క్యారెక్టర్‌కు సరిపోయే ఫిజిక్ కోసం తెగ కష్టపడుతోంది. ఈ క్రమంలోనే తన ట్రైనర్ ఆధ్వర్యంలో హులా హూప్ ఛాలెంజ్‌లో పాల్గొని అదరగొట్టేసింది.
ఒకసారి ఆమె నెట్టింట షేర్ చేసిన వీడియోను గమనిస్తే.. హులా హూప్ చేయలేక అనేకసార్లు ప్రయత్నించిన డీలా పడిపోయిన దీపిక మళ్లీ పట్టువిడవకుండా ట్రై చేస్తూ ఫర్ఫెక్ట్ చేసి చూపించి ఔరా అనిపించింది. ఈ ఉల్లాసభరితమైన వీడియోను స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న నటి.. ‘కొంత విరామం తర్వాత మళ్లీ హెయిర్‌స్టైలిస్ట్ పటోరితో.. హులా హూప్ ఛాలెంజ్’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
బ్లూ కలర్ డెనిమ్ జీన్స్, బ్లాక్ కలర్ టాప్‌లో బ్యూటీఫుల్‌గా కనిపించిన దీపక సెట్‌లోనూ అందరినీ అలరిస్తూ తెగ సందడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. చివరగా ‘జవాన్’లో అతిధి పాత్రలో కనిపించనున్న దీపిక ప్రభాస్‌తోనూ ‘కల్కి 2898’లో నటిస్తోంది.
Read More: Rani Mukerji: ఈ తరానికి ఆ ధ్యాసే లేదు.. నటీనటులపై రాణి ముఖర్జీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..