రామ్ చరణ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం..

by Hamsa |   ( Updated:2023-01-23 06:07:54.0  )
రామ్ చరణ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఇటీవల తాను ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుండి ఉపాసన అన్ని శుభవార్తలు వింటూ సంతోషంగా గడుపుతుంది. ఈ క్రమంలో ఉపాసన పుట్టింట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె గ్రాండ్ మదర్ పుష్నాని తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ''కడవరకు కృతజ్ఞత, ప్రేమ, గౌరవం, సానుభూతితో తన జీవితాన్ని కొనసాగించింది. ఆమె జీవితం నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. పుష్నాని నన్ను పెంచి పెద్ద చేసింది. ఆమె పంచిన ప్రేమను నేను ఎన్నటికీ మరువలేను. నేను నా గ్రాండ్‌ పేరెంట్స్‌ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. ఆ అనుభూతులన్నింటినీ నా పిల్లలకు అందేలా చూస్తానని ప్రమాణం చేస్తున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి'' అంటూ ఎమోషనల్ అయ్యింది.

నగ్నత్వం తలపిస్తున్న దిశా పటాని బోల్డ్ లుక్.

Advertisement

Next Story