Deadpool & Wolverine: అభిమానుల్ని దిల్ ఖుష్ చేస్తున్న డెడ్‌పూల్ & వాల్వరిన్.. మూడు రోజుల కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

by sudharani |   ( Updated:2024-07-29 08:03:44.0  )
Deadpool & Wolverine: అభిమానుల్ని దిల్ ఖుష్ చేస్తున్న డెడ్‌పూల్ & వాల్వరిన్.. మూడు రోజుల కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
X

దిశ, సినిమా: రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘డెడ్‌ఫూల్ & వాల్వరిన్’. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా స్పెషల్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తూ వచ్చారు. అలాగే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్, టీజర్లు, ట్రైలర్లు వరల్డ్ వైడ్‌గా ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా జూలై 26న థియేట‌ర్లలో విడుదలైన ఈ చిత్రం.. సూప‌ర్ బ్లాక్ బ‌స్టర్ టాక్‌తో విజ‌యవంతంగా దూసుకుపోతుంది. కేవలం విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ మూవీ బాక్స్ ఫీస్‌ని షేక్ చేస్తుంది.

మూడు రోజుల్లో దాదాపు రూ. 3670 కోట్లు క‌లెక్ట్ చేసి కాసుల వర్షం కురిపిస్తుంది. ఇండియాలో కూడా డెడ్‌ఫూల్ అండ్ వాల్విరిన్ క‌లెక్షన్ల హ‌వా కొన‌సాగుతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు అభిమానుల అద‌ర‌ణ ద‌క్కింది. తెలుగు డ‌బ్బింగ్ వెర్షన్‌లో ఉన్న టైమ్లీ డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా.. వచ్చే రోజుల్లో ‘డెడ్‌ఫూల్ & వాల్వరిన్’ ఎన్ని కలెక్షన్లు రాబడుతోందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story