Devara: ‘దేవర’ నుంచి సాలిడ్ అప్‌డేట్.. రొమాంటిక్ పోజ్‌లో ఆకట్టకుంటున్న ఎన్టీఆర్, జాన్వీ

by sudharani |   ( Updated:2024-08-02 14:52:54.0  )
Devara: ‘దేవర’ నుంచి సాలిడ్ అప్‌డేట్.. రొమాంటిక్ పోజ్‌లో  ఆకట్టకుంటున్న ఎన్టీఆర్, జాన్వీ
X

దిశ, సినిమా: జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్‌తోనే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుపుకుంటుంది. దీంతో వరుస అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే ఇటీవల వచ్చిన ‘ఫియర్’ సాంగ్ యూట్యూబ్‌లో కొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది.

ఈ స్పీడ్‌లోనే తాజాగా సెకండ్ సింగిల్‌పై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మేరకు ‘దేవర’ సినిమాలో సెకండ్ సింగిల్‌ను ఈనెల 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతే కాకుండా.. జాన్వీ కపూర్‌తో ఎన్టీఆర్ స్టెప్పులేసిన ఫొటోను రిలీజ్ చేయగా.. ఇందులో తారక్, జాన్వీ రొమాంటిక్ లుక్ ఆకట్టుకుంటుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారడంతో.. సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా.. ‘దేవర’ పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story