బాలయ్య ‘భగవంత్ కేసరి’ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

by Hamsa |   ( Updated:2023-10-06 03:32:48.0  )
బాలయ్య ‘భగవంత్ కేసరి’ మూవీ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ లాంటి వారు ఇందులో నటిస్తున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే భగవంత్ కేసరి నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఈ మూవీ తదుపరి అప్డేట్స్ వస్తాయా అని బాలయ్య ఫ్యాన్స్ అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రం ట్రైలర్ ను అక్టోబర్ 8వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిని కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల కానుందని నెట్టింట జోరుగా పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రకటించిన విధంగా ఈ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story