Darling Movie Review: డార్లింగ్ మూవీ రివ్యూ.. నభా నటేష్ హిట్ కొట్టినట్టేనా?

by Prasanna |   ( Updated:2024-07-19 02:41:11.0  )
Darling Movie Review: డార్లింగ్ మూవీ రివ్యూ.. నభా నటేష్ హిట్ కొట్టినట్టేనా?
X

దిశ,సినిమా: యాక్సిడెంట్ అయినా తర్వాత కొంత కాలం విరామం తీసుకుని డార్లింగ్ నభా నటేష్ రీ ఎంట్రీ ఇచ్చింది. నభా కి జోడిగా ప్రియదర్శి నటించాడు. ఈ మూవీకి అశ్విన్ రామ్ డైరెక్షన్ వహించారు. హనుమాన్ నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ మూవీని నిర్మించారు. ఈ రోజు గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైంది. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఫస్ట్ హాఫ్ రాఘవ్ ( ప్రియదర్శి) జీవితం, అతని కల, పెళ్లి బ్రేక్ అవ్వడం , మధ్యలో ఆనంది (నభా నతేష్) పరిచయం, పెళ్లి తర్వాత ఆమెలో ఉన్న స్ప్లిట్ పర్సనాలిటీస్ సమస్య బయట పడటం, ఆమెతో రాఘవ్ పడే కష్టాలు కామెడీగా రన్ అవుతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆనంది నిముష మిముషానికి మారిపోతూ ఉంటుంది. ఇక రాఘవ్ కి ఏమి చేయాలో కూడా అర్ధం కాక భార్య దగ్గర ఉండలేక స్నేహితులతో తన బాధను చెప్పుకోలేక లోలోపల బాధ పడుతుంటాడు. ఇలా కామెడీగా మూవీ రన్ అవుతూనే తన భార్యని కాపాడుకోవాలని రాఘవ్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ అందర్ని బాగా నవ్విస్తాడు. క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి డైరెక్టర్ అందర్ని షాక్ కి గురి చేసారు. అదేంటో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

ఎప్పటిలానే ప్రియదర్శి తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించి హిట్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో కామెడీగానే కాకుండా తనలో ఎమోషన్ కూడా కనబడుతుంది. నభా నటేష్ నటన మూవీకి ప్లస్ అయింది. అయిదుగురిలా నటించడమంటే అంత ఈజీ కాదు. ఒక రకంగా చెప్పాలంటే నభా అదరగొట్టేసింది. ఇక అనన్య నాగళ్ళ సైకాలజిస్ట్ పాత్రలో నటించి మంచి మార్కులు వేపించుకుంది. మొత్తానికి ఈ సినిమా ఇద్దర్ని గండం గట్టెక్కించిందనే చెప్పుకోవాలి. సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా చేసే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed