‘దక్షిణ’ సినిమా విజయం సాధిస్తుంది: శివాజీ

by sudharani |
‘దక్షిణ’ సినిమా విజయం సాధిస్తుంది: శివాజీ
X

దిశ, సినిమా: ‘మంత్ర, మంగళ’ వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ఓషో తులసిరామ్ ఇప్పుడు ‘దక్షిణ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ‘కబాలి’ ఫేమ్ సాయి ధన్షిక, ‘మహాభారత్ మర్డర్స్’ పేమ్ రిషవ్ బసు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని కల్ట్ కాన్సెప్ట్స్ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు నటుడు శివాజి, ఆర్పి.పట్నాయక్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘మంత్ర సినిమాతో సంచలన విజయం సాధించిన దర్శకులు ఓషో తులసీరామ్. అప్పట్లోనే ఆ సినిమా పది కోట్లకు పైన వసూలు చేసింది. మంచి నిర్మాత దొరికితే గొప్ప సినిమాలు చెయ్యగల సత్తా ఉన్న దర్శకుడు ఓషో. ఈ ఈయన ‘దక్షిణ’ అనే మంచి కాన్సెప్ట్‌తో వస్తోన్నాడు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు. ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘దక్షిణ ట్రైలర్ చాలా బాగుంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు బాలాజీ చాలా ప్రతిభావంతుడు, తనకు ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఓషో తులసీరామ్ గొప్పగా ఆలోచించే దర్శకుడు. మంత్ర సినిమా తరహాలోనే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed