- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెళ్లిళ్ల వెనుక కోట్ల బిజినెస్..? నాగ చైతన్య అడిగితే సీరియస్ వార్నింగ్.. నాగార్జున షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 60 ఏళ్లు పైబడినా ఇప్పటికీ తాను మైంటైన్ చేస్తున్న ఫిట్ నెస్ టాలీవుడ్ లో ఇంకెవరికి సాధ్యం కాదేమో. ఇప్పటికీ కూడా నవ మన్మధుడే అని అంటున్నారు అభిమానులు. అయితే నాగార్జునకి సినిమాలు ఒకటే కాదు వివిధ రకాల బిజినెస్‌లు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నాగార్జున ఎలాంటి ఒత్తిడి తీసుకోరు. ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు క్లారిటీ ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు. ఇక ఫ్యామిలీ విషయంలో కూడా నాగ్ కేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగార్జున ఇండస్ట్రీలో జరుగుతున్న తతంగం గురించి.. బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పెళ్లిళ్ల వెనుక జరుగుతున్న కోట్ల బిజినెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పెళ్లికి హాజరైతే డబ్బు ఇస్తామని తనకు చాలా మంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఆఫర్ ఇచ్చినట్లు నాగార్జున రివీల్ చేశారు. అలాంటోళ్లని ఏమనాలో నాకు అర్థం కాదు. కానీ నేను అలాంటి వాటి జోలికి వెళ్లను.. ఎంకరేజ్ చేయను. అతిథిగా వచ్చి ఒక 20 నిమిషాలు ఉండి వెళ్ళిపోతే కళ్ళు చెదిరే మొత్తం ఇస్తామని ఆఫర్ చేశారు. ఎంత డబ్బు ఇస్తారనేది కచ్చితంగా చెప్పలేం. బాలీవుడ్ స్టార్స్ అయితే కోట్లలో తీసుకుంటారు.
టాలీవుడ్ వాళ్లకి 10 లక్షలు ఇస్తారా అని యాంకర్ అడగగా అది చాలా తక్కువ అని నాగార్జున అన్నారు. అయితే డబ్బు తీసుకుని పెళ్లిళ్లకి వెళ్లే స్టార్స్ ని నేను తప్పు పట్టను. నేను వెళ్ళను కానీ అది తప్పు కాదు అని నా అభిప్రాయం. హీరోకి రెండు ఫ్లాపులు వస్తే పక్కన ఉన్న వాళ్లు కూడా వెళ్ళిపోతారు. అలాంటప్పుడు క్రేజ్ ఉన్నప్పుడు డబ్బు తీసుకోవడంలో తప్పులేదు. సినిమాల్లో కూడా అంతే. నిర్మాతలు సక్సెస్ ఉన్న హీరో వెంట మాత్రమే పడతారు. ఒక సక్సెస్ పడితే బోలెడన్ని ఆఫర్స్ వస్తాయి. తన పెద్ద కొడుకు నాగ చైతన్య కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు అని నాగార్జున అన్నారు.
నాగ చైతన్యకి ఒక సక్సెస్ రాగానే నిర్మాతలు వెంటపడ్డారు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. చైతు నాకు ఫోన్ చేసి నాన్న ప్రొడ్యూసర్స్ ఇలా అంటున్నారు అని చెప్పేవాడు. అప్పుడు నాగార్జున చైతూకి సీరియస్ ఒక విషయం హెచ్చరించారట. నాగార్జున చైతుకి చెబుతూ.. నిర్మాత ఎంత డబ్బు ఇస్తున్నాడు అనేది కాదు.. ఫస్ట్ అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకో.. మంచివాడా కాదా అనే విషయం ఆరా తీసి ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రా అని చెప్పారట. అదే విధంగా దర్శకుడి గురించి కూడా తెలుసుకొని సినిమాకి ఒకే చెప్పాలని నాగార్జున చైతన్యతో అన్నారట. ఎందుకంటే డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అది ముఖ్యం కాదు అని నాగార్జున తెలిపారు. కొంతమంది నిర్మాతలు సినిమాపై ఏమాత్రం అవగాహన లేకుండా వ్యాపారాల్లో డబ్బు సంపాదించి వచ్చేస్తుంటారు అని నాగార్జున తెలిపారు. ఈ విషయాలన్నీ నాగార్జున తెలిపారు.