కేవలం 9 రోజులు మాత్రమే.. శ్రీ విష్ణు సినిమాపై క్రేజీ అప్‌డేట్

by sudharani |
కేవలం 9 రోజులు మాత్రమే.. శ్రీ విష్ణు సినిమాపై క్రేజీ అప్‌డేట్
X

దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’. ఇందులో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ‘శ్వాగ్’ అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉండటంతో.. సినిమా నుంచి వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ‘శ్వాగ్’ సినిమా నుంచి క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు సినిమా యూనిట్. ఈ మేరకు ‘𝟗 𝐃𝐀𝐘𝐒... మాత్రమే.. శ్రీవిష్ణు దివాకర్ పేట ఎస్ ఐ భవభూతిగా తెరపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టర్‌లో విష్ణు.. సాల్ట్‌ పెప్పర్‌ లుక్‌లో స్టైలిష్‌ బ్లాక్ గాగుల్స్‌ పెట్టుకొని సిగరెట్‌ తాగుతూ కనిపిస్తున్నాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed