రామ్ హీరోగా బోయపాటి తీస్తున్న మూవీపై క్రేజీ రూమర్స్

by Prasanna |   ( Updated:2023-01-02 06:07:21.0  )
రామ్ హీరోగా బోయపాటి తీస్తున్న మూవీపై క్రేజీ రూమర్స్
X

దిశ, సినిమా : ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తాజాగా హీరో రామ్‌తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇంటర్వెల్‌పై ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఇందులో రామ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను అలరిస్తోందని.. ముఖ్యంగా రామ్ క్యారెక్టర్‌లోని వేరియేషన్ అసలు ఎవరూ ఊహించలేనివని తెలుస్తోంది. అయితే బోయపాటి సహజంగానే తన సినిమాల్లో ఇంటర్వెల్ సీక్వెన్స్‌లను చాలా స్ట్రాంగ్‌గా రాసుకుంటాడనే టాక్ ఇప్పటికే ఉంది. అయితే ఈ మూవీని కూడా బోయపాటి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా మలిచేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపడే సరికొత్త స్టోరీతో సినిమా కథను ప్లాన్ చేశాడట. ఆల్రెడీ అఖండ సినిమాతో భారీహిట్ కొట్టిన బోయపాటి ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమా‌పై కూడా భారీ అంచనాలు ఉన్నట్టు తెలుస్తోంది. అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన మూవీస్‌లో మాస్ ఎలిమెంట్స్‌ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటి వెన్నతోపెట్టిన విద్య అని చెప్పవచ్చు.

Also Read...

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌‌పై విమర్శలు.. Megastar Chiranjeevi రియాక్షన్ ఇదే!

Advertisement

Next Story

Most Viewed