- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బ్రహ్మముడి: ఒకరికి ఒకరై'.. తెలుగు సీరియల్‌ను ప్రమోట్ చేస్తున్న Sharukh Khan!
దిశ, సినిమా : గత కొంతకాలంగా బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా. కానీ, ఇప్పుడు ఇండియన్ సినిమాకు అర్థం మారిపోయింది. ఈ మార్పు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో మొదలై 'ఆర్ఆర్ఆర్'తో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మన సినిమాకు ప్రేక్షకులు, విదేశీ ప్రియులు, స్టార్స్ డైరెక్టర్ టెక్నీషియన్ ఫిదా అవుతున్నారు. మన సంస్కృతి సంప్రదాయాలు బాలీవుడ్ సినిమాల్లో కనిపించడం లేదని, పలువురు బాహాటంగా విమర్శలు చేయడంతో బాలీవుడ్ కళ్లు తెరిచింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించినప్పుడే మళ్లీ బాలీవుడ్ సినిమాలకు మంచి రోజులు వస్తాయని, అక్కడ స్టార్స్‌కు లేటుగా అర్థమైంది. అయితే బాలీవుడ్ చిత్రాలు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల వారికి చేరాలంటే.. ముందు వారిని ప్రసన్నం చేసుకోవాలని అర్థమైంది అనుకుంట. ఈ ఆలోచనకు షారుఖ్ ఖాన్ శ్రీకారం చుట్టాడు. అవును షారుఖాన్ నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ 'పఠాన్' జనవరి 25న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నాడు షారుఖ్. అందుకోసం తెలుగు బుల్లి తెరపై ప్రత్యక్షం అవ్వనున్నాడు. 'స్టార్ మా'లో త్వరలో ప్రసారం అయ్యే కొత్త సీరియల్ 'బ్రహ్మముడి: ఒకరికి ఒకరై'ని ప్రమోట్ చేస్తూ కనిపించాడు బాద్ షా. తాజాగా స్టార్ మా షేర్ చేసిన ట్యీట్‌లో 'బ్రహ్మముడి: ఒకరికి ఒకరై' గ్రాండ్ లాంచ్ గురించి చెప్పుకొచ్చాడు షారుఖ్ ఖాన్. ఈ వీడియోలో ఈ సీరియల్ కథను అభివర్ణించిన ఆయన జనవరి 24 నుంచి స్టార్ మా లో ప్రతిరోజు రాత్రి 7:30 నిమిషాలకు ప్రసారం కానుందన్నారు. దీంతోపాటు 'పఠాన్' మూవీని కూడా ప్రమోట్ చేశాడు. గతంలో ఇలా ఏ బాలీవుడ్ స్టార్ తెలుగు సీరియల్‌కు ప్రచారం చేస్తూ తన సినిమాను ప్రమోట్ చేసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్ స్టార్స్ మెట్టు దిగి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : 'సింహాద్రి' రీ రిలీజ్‌కు సర్వం సిద్ధం !