Director Bobby: బంపర్ ఆఫర్ కొట్టేసిన దర్శకుడు బాబీ!

by Prasanna |   ( Updated:2023-04-12 08:57:35.0  )
Director Bobby: బంపర్ ఆఫర్ కొట్టేసిన దర్శకుడు బాబీ!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ మూవీతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ మూవీ దర్శకుడు బాబి చిరుకు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. తన హీరోని ఎలా అయితే చూడాలనుకున్నాడో అలా సినిమా తీసి తన కెరీర్‌లో బిగ్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే తాజాగా ఇప్పుడు బాబీ మరో స్టార్ హీరోతో సినిమా చేసే చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. బాబీ తన తదుపరి ప్రాజెక్ట్‌ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో చేయనున్నాడని క్రేజీ రూమర్ ఒకటి బయటకు వచ్చింది.

ఇవి కూడా చదవండి: నా కూతురును అలాంటి పనులు చెయ్యమని చెప్పలేను: రవీనా టాండన్

Advertisement

Next Story

Most Viewed