- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘లియో’ రిలీజ్‌పై వివాదం.. మీడియా ముందు నిర్మాత నాగవంశీ క్లారిటీ..
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘లియో’. అక్టోబర్ 19న వరల్డ్ వైల్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఈ మూవీ టైటిల్‌ను మరొకరు రిజిస్టర్ చేసుకోవడంతో తెలుగులో ఈ సినిమా రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొంది. దీంతో ఈ చిత్రం రిలీజ్ అవుతుందో లేదో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలుగులో ‘లియో’ టైటిల్‌ను ఒకరు రిజిస్టర్ చేయించుకున్నారు. వారు మమ్మల్ని కలవకుండా నేరుగా కోర్టును ఆశ్రయించారు. ఈ విషయం నాకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. రిజిస్టర్ చేయించుకున్న వారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిష్కారం అవుతుంది. ‘లియో’ తెలుగు విడుదలలో ఎలాంటి మార్పు లేదు. అక్టోబర్-19 నే తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అంతే కాకుండా ఉదయం ఏడు గంటలకు షోస్ పడటం పక్కా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
- Tags
- LEO Movie