- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పఠాన్ మూవీలోని బేషరంమ్ సాంగ్‌పై కొనసాగుతున్న వివాదం !
భోపాల్: పఠాన్ మూవీలోని బేషరమ్ సాంగ్‌పై రోజుకో చర్చ నడుస్తూనే ఉంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గిరీష్ కుమార్ షారుఖ్ ఖాన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివాదస్పదంగా మారిన పఠాన్ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ తన కూతురుతో కలిసి చూడాలని అన్నారు. సోమవారం ఐదు రోజులు అసెంబ్లీ శీతకాల సమావేశాల్లో ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. షారుఖ్ ఈ సినిమాను తన కూతురితో కలిసి చూడాలి. సినిమా చూస్తున్నానని ప్రపంచానికి తెలిసేలా ఫోటో షేర్ చేయండి' అని అన్నారు. ఇది ఖచ్చితంగా అనుమతించలేమని తెలిపారు. దమ్ముంటే మహ్మద్ ప్రవక్తపై సినిమా తీసి భావప్రకటన స్వేచ్ఛ పేరుతో విడుదల చేయాలని సవాల్ చేశారు. కెనడాలో ఏదో జరిగితే ముంబై అల్లర్లకు పాల్పడ్డారని, అదే ఇరాన్‌లో హిజాబ్‌పై నిరసనలు జరుగుతుంటే మిన్నకుండి పోయారని దుయ్యబట్టారు. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతలు కూడా సినిమాపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఓ సంస్కృతిని ప్రతిబింబించే రంగులను ధరించడం విలువలకు వ్యతిరేకమని అన్నారు. సమస్య పఠాన్ సినిమా కాదని, అందులోని వస్త్రధారణ అని పేర్కొన్నారు. అంతకుముందు హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా బేషరమ్ పాటలో దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా విడుదలైన పఠాన్ సినిమా పాటలో దీపికా ధరించిన దుస్తుల రంగుపై ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేక ఎదురైంది.
ఇవి కూడా చదవండి :
సినిమా షూటింగ్ చేసుకునేందుకు అక్కడ అనుమతివ్వాలంటూ కంగనా లేఖ