జాక్వెలిన్ బర్త్ డేకు సుఖేష్ చంద్రశేఖర్ సర్‌ప్రైజ్..

by Aamani |   ( Updated:2023-05-07 14:27:18.0  )
జాక్వెలిన్ బర్త్ డేకు సుఖేష్ చంద్రశేఖర్ సర్‌ప్రైజ్..
X

దిశ, సినిమా: హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు మరోసారి లవ్ లెటర్ రాశాడు సుఖేష్ చంద్రశేఖర్. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్‌లో ఆమె చేసిన డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేసిన కాన్మన్.. ఎలిగెంట్, క్లాసీ, సూపర్ హాట్ అంటూ పొగిడేశాడు. వర్ణించేందుకు మాటలు కూడా కరువయ్యాయని.. మరింత క్రేజీగా లవ్‌లో పడేసిన సూపర్ స్టార్ అని ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు జాక్వెలిన్ బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఉంటుందని, కచ్చితంగా ఆమెకు నచ్చుతుందన్న సుఖేష్.. ‘నా ప్రామిస్ నిలబెట్టుకుంటున్నా. నువ్వు నవ్వుతూ ఉండటమే నాకు కావాలి. నిజం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డోంట్ వర్రీ బేబీ’ అని లెటర్‌లో చెప్పుకొచ్చాడు.

Also Read..

'ఇంకోసారి స్టేడియంలో కనిపించావనుకో'..! వర్షిణిపై నెటిజన్స్ ఫైర్

Advertisement

Next Story

Most Viewed