నిహారిక కొణిదెల సమర్పణలో మూవీ.. రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’

by sudharani |
నిహారిక కొణిదెల సమర్పణలో మూవీ.. రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’
X

దిశ, సినిమా: మెగా వారసురాలు నిహారిక కొణిదెల సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైనా టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కు మంచి స్పంద‌న లభించింది. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ లాక్ చేశారు చిత్రం యూనిట్. ఆగ‌స్ట్‌లో వ‌చ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సంద‌ర్భంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగ‌స్ట్ 9న విడుద‌లవుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ మూవీని శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ జ‌య‌ల‌క్ష్మితో కలిసి నిర్మించటం చాలా హ్యాపీగా ఉంది. న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఎక్కువ మంది కొత్త వాళ్లతోనే సినిమాను పూర్తి చేశాం. డైరెక్టర్ య‌దు వంశీ మంచి ప్లానింగ్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలోనే పూర్తి చేయ‌టం విశేషం. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్ అంద‌రికీ న‌చ్చే సినిమాతో ఆగ‌స్ట్ 9న ప్రేక్షకుల‌ ముందుకు రాబోతున్నాం. సిద్ధంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story