నా పర్సనల్ లైఫ్‌తో ఆడుకుంటున్నారు.. ఆ వెబ్‌సైట్‌పై సీరియస్ అయిన కలర్స్ స్వాతి..

by sudharani |   ( Updated:2023-10-07 13:11:50.0  )
నా పర్సనల్ లైఫ్‌తో ఆడుకుంటున్నారు.. ఆ వెబ్‌సైట్‌పై సీరియస్ అయిన కలర్స్ స్వాతి..
X

దిశ, సినిమా : ‘మంత్ ఆఫ్ మధు’ మీడియా మీట్‌లో ఓ వెబ్‌సైట్‌పై ఫైర్ అయింది కలర్స్ స్వాతి. విడాకుల గురించి అడిగిన సురేశ్ కొండేటితో గొడవపడిందని నీచమైన రాతలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్నాళ్లుగా తన పర్సనల్ లైఫ్‌తో ఆడుకుంటున్నారని.. మెంటల్ టార్చర్‌ చేస్తున్నారని బాధపడిపోయింది. అందుకే ఐదేళ్లుగా ఆ సైట్‌లో న్యూస్ చదవడమే మానేశానని చెప్పింది. ఇక తాజాగా మళ్లీ అదే రాతలు రాయడం సరికాదన్న స్వాతి.. ఇండస్ట్రీ తనకు బ్రేక్ ఇచ్చిందని రాశారు కానీ ఇలాంటి వార్తల నుంచి బ్రేక్ కావాలని కోరింది. సదరు వెబ్‌సైట్‌కు సంబంధించిన మనుషులు ప్రెస్‌మీట్‌కు రాకుండానే ఇంత దారుణమైన స్టోరీలు ఎలా అల్లేస్తున్నారని మండిపడింది స్వాతి.

Advertisement

Next Story