Dhoom Dham: కలర్‌ఫుల్ డ్యూయెట్‌.. ‘ధూం ధాం’ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్..

by sudharani |
Dhoom Dham: కలర్‌ఫుల్ డ్యూయెట్‌.. ‘ధూం ధాం’ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్..
X

దిశ, సినిమా: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధూం ధాం’. సాయి కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇక త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘ధూం ధాం’ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్నాయి.

ఇప్పటికే ఇందులో నుంచి విడుదైల అప్‌డేట్స్‌కు మంచి స్పందన రాగా.. 'మల్లెపూల టాక్సీ..', 'మాయా సుందరి..' పాటలు పాటలు ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ఇదే స్పీడ్‌లో తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ 'టమాటో బుగ్గల పిల్ల..' విడుదల చేశారు. 'ఎట్టెట్టగున్నా నువ్వు భల్లేగుంటావే...ఏ మాయో చేసి నన్ను గిల్లేస్తుంటావే..బంగారం గానీ తిన్నావా నువ్వు బబ్లీగా ముద్దొస్తుంటావే..బంగాళాఖాతం చెల్లెల్లా నన్ను అందంతో ముంచెస్తుంటావే..టమాటో బుగ్గల పిల్ల..' అంటూ సాగుతున్న ఈ సాంగ్ కలర్‌ఫుల్ డ్యూయెట్‌గా ఆకట్టుకుంటోంది.



Next Story