చెడిందా.. చెడగొట్టుకుంటున్నారా.. మళ్లీ కలవని విధంగా మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య గొడవలు.. కారణం బన్నీనేనా?

by Jakkula Samataha |
చెడిందా.. చెడగొట్టుకుంటున్నారా.. మళ్లీ కలవని విధంగా మెగా, అల్లు ఫ్యామిలీస్ మధ్య గొడవలు.. కారణం బన్నీనేనా?
X

దిశ, సినిమా : అల్లు,మెగా ఫ్యామిలీల మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో వీరికి పడటం లేదు, చాలా రోజుల నుంచి వీరు దూరం దూరంగా ఉంటున్నారు అంటూ అనేక వార్తలు వచ్చాయి. కానీ వారు సంక్రాంతి పండుగను కలిసి సెలబ్రేట్ చేసుకోవడంతో ఆ రూమర్స్‌కు చెక్ పడింది. అయితే రీసెంట్‌గా 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ విజయం సాధించాలని, మెగా ఫ్యామిలీ ఎంతో కృషి చేసింది. తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రచారానికి వచ్చి పవన్‌కు సపోర్ట్ ఇచ్చారు. కానీ బన్నీ మాత్రం వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో అసలు గొడవ మొదలైంది. దీంతో బన్నీ మీద మెగా ఫ్యాన్స్, కుటుంబ సభ్యులు కూడా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా నాగబాబు అల్లు అర్జున్ పై పరోక్షంగా కామెంట్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఆయన మనోడే కానీ పగోడు అంటూ నాగబాబు కామెంట్ చేశారు. తర్వాత అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు.

అయితే బుధవారం పవన్ ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వెళ్లి, తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్, బన్నీని అన్ ఫాలో చేశారు. దీంతో మరోసారి మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న వాగ్వాదాలకు అజ్యం పోసినట్లయింది. అయితే అల్లు అరవింద్‌కు చిరు, పవన్ అంటే ఎనలేని అభిమానం. వీరితో కలిసి ఆయన చాలా సినిమాలు నిర్మించారు. వీరి కుటుంబంలో ఏ చిన్న ఈవెంట్ అయినా సరే అల్లు ఫ్యామిలీ పాల్గొంటుంది. వారి కుటుంబంలోని ఫంక్షన్స్‌కు కూడా మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్లి సందడి చేస్తుంటుంది. కానీ , బన్నీ శిల్పారవికి సపోర్ట్‌గా ప్రచారం చేయడం, ప్రమాణ స్వీకారానికి అల్లు అర్జున్‌కు ఆహ్వానం అందినా రాకపోవడంతో, వీరి మధ్య చాలా పెద్ద ఎత్తునే గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు నెటిజన్స్. ముఖ్యంగా అల్లు అర్జున్ వల్లనే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ విడిపోతుంది. ఆయన ఒక ఈవెంట్‌లో పవన్ గురించి ఏదైనా చెప్పమని అడగ్గా చెప్పను అంటూ మొహం చాటేశారు. దీంతో అల్లు అర్జున్‌కు మెగా ఫ్యామిలీ అంటే నచ్చడం లేదు. చాలా రోజుల నుంచి ఆయన వారితో విడిపోవాలనే చూస్తున్నారు. ఇప్పుడు సందర్భం కలిసి రావడంతో ఆనందంగా మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం అవుతున్నాడు, ఇక వీరి ఫ్యామిలీస్ మళ్లీ కలవవు అంటూ పలువురు ముచ్చటిస్తున్నారు. మరీ నిజంగానే అల్లు, మెగా ఫ్యామిలీకి చెడిందా.. లేదా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed