Sai Pallavi : పెళ్లైన వ్యక్తితో సాయి పల్లవి డేటింగ్.. అసలు విషయం ఏమిటంటే?

by Jakkula Samataha |
Sai Pallavi : పెళ్లైన వ్యక్తితో సాయి పల్లవి డేటింగ్.. అసలు విషయం ఏమిటంటే?
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన డ్యాన్స్, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది.మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఎక్కువగా రొమాంటిక్ సీన్స్‌లో నటించకపోవడం, చాలా సింపుల్‌గా, ట్రెడిషనల్‌గా ఉండటంతో చాలా మందికి సాయిపల్లవి అంటే అమితమైన అభిమానం ఉంటుంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళతో పాటు, బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాచేస్తుంది. ఈ క్రమంలోనే ఈ మలయాళ బ్యూటీ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

నేచురల్ బ్యూటీగా మంచి ఫేమ్ సంపాదించుకున్నసాయిపల్లవి ఓ పెళ్లైన హీరోతో డేటింగ్‌లో ఉన్నదంటూ ఇటీవల తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతే కాకుండా ఆ హీరోకు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారంట. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇది చూసిన కొందరు, సాయిపల్లవి ఏంటీ పెళ్లైన హీరోతో డేటింగ్‌లో ఉండటం ఏంటీ? అని షాక్ అవుతున్నారు. కాగా, తాజాగా దీనిపై మరో వార్త కూడా బయటకు వచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కావాలనే ఎవరో రూమర్ క్రియేట్ చేసినట్లు సమాచారం.



Next Story