- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రారంభమైన సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. టాలీవుడ్ హీరోల మ్యాచ్ ఎప్పుడో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) తర్వాత తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసేది సెలెబ్రిటీ క్రికెట్ లీగ్(CCL) కోసమే. తెరమీద ప్రేక్షకులను ఎంతలా ఆనందింపచేస్తారో.. మైదానంలో అదే రేంజ్‌లో ఉత్సాహ పరుస్తుంటారు నటులు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ హీరోలు పాల్గొంటుడంతో ఈ మ్యాచ్‌లు ఆసక్తికరంగా మారుతుంటాయి. తాజాగా.. 2024 సీసీఎల్ ఇవాళ ప్రారంభమైంది. దుబాయ్‌లోని షార్జా మైదానం వేదికగా సినీ ప్రముఖల క్రికెట్ మ్యాచ్‌లు షురూ అయ్యాయి. ఇవాళ్టి (ఫిబ్రవరి 23) నుంచి మార్చి 17వ తేదీ వరకు ఈ మ్యాచులు జరుగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు మ్యాచ్‍లు షార్జాలో జరగనున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్, చండీగఢ్, త్రివేండ్రం, వైజాగ్‍లో మ్యాచ్‍లు ఉంటాయి.
ఫైనల్‍తో కలిసి మొత్తంగా 20 మ్యాచ్‍లు ఉండనున్నాయి. తెలుగు వారియర్స్ జట్టుకు అక్కినేని అఖిల్ కెప్టెన్‍గా వ్యవహరిస్తున్నారు. ఇవాళ తొలి మ్యాచ్‌లో ముంబై హీరోస్ vs కేరళ స్ట్రైకర్స్ తలపడుతున్నారు. షార్జా వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 24, మధ్యాహ్నం 2:30 గంటలకు తెలుగు వారియర్స్ vs భోజ్‍పురి దబాంగ్స్ మధ్య మ్యాచ్ ఉండనుంది. ఈ సీసీఎల్ మ్యాచులన్నీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన జియోసినిమాలో లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. ఉచితంగా మ్యాచ్ చూడొచ్చు. ఈ సీజన్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, పంజాబీ, భోజ్‍పురి, బెంగాలీ భాషల జట్లు తలపడనున్నాయి.