దీపికతో ఆ పని చేయాలనుంది.. ఆమె నాకు బాగా నచ్చింది: గేల్

by samatah |   ( Updated:2023-05-24 12:37:32.0  )
దీపికతో ఆ పని చేయాలనుంది.. ఆమె నాకు బాగా నచ్చింది: గేల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె టాలెంట్‌కు ఫిదా అయ్యానంటున్నాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్. ఆయన నటించిన ‘ఓ ఫాతిమా’ అనే వీడియో సాంగ్ త్వరలో రిలీజ్ కానుండగా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నాడు గేల్. ఈ సందర్భంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ దీపికతో డ్యాన్స్ చేయాలనుందంటూ తన మనసులో మాట బయపెట్టాడు. ‘దీపికా పదుకొణెతో కలిసి ఒక పాటలో డ్యాన్స్ చేయాలని ఉంది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమెను ఓసారి కలిశాను. చాలా మంచి మహిళ’ అంటూ నటిని పొగిడేశాడు. అలాగే సంగీత ప్రపంచలోకి రావాడానికి తనను ప్రేరేపించిన చాలా సందర్భాలను గుర్తు చేసుకున్న గేల్.. తన క్రికెట్ కెరీర్‌ ముగిసిన తర్వాత ఇలా పాటలు పాడే సాహసం చేస్తానని ఎప్పూడూ ఊహించలేదంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.

Read More: ఢిల్లీ మెట్రోలో నటికి లైంగిక వేధింపులు.. అబ్బాయిలు గుంపుగా దాడిచేశారట

సత్యదేవ్‌ ‘ఫుల్‌బాటిల్‌’.. టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertisement

Next Story